రేణుదేశాయ్ .. ఎ లవ్ ఆన్ కండిషనల్

144
Renu Desai A love unconditional
Renu Desai A love unconditional

Renu Desai A love unconditional | రేణుదేశాయ్ .. ఎ లవ్ ఆన్ కండిషనల్ ….. రేణుదేశాయ్ .. పవన్ కల్యాణ్ నుంచి విడిపోయిన తరువాత కూడా సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ వార్తల్లో నిలుస్తుంది. రీసెంట్ గా కళామందిర్ కళ్యాణ్  ‘కాంచీపురం వరమహలక్ష్మి సిల్క్స్” కి బ్రాండ్ అంబాసడర్ గా యాడ్ ఫిల్మ్ లో కూడా నటించింది.. అలాగే ఒక సినిమాకు దర్శకత్వం వహించే ఆలోచనలో ఉంది.

మొదటి నుంచి కూడా తన కవితలతో సోషల్ మీడియాలో సందడి చేసే రేణుదేశాయ్ తాజాగా రచించిన “ఎ లవ్ ఆన్ కండిషనల్” అనే పుస్తకాన్ని ప్రోమోట్ చేసే పనిలో ఉంది. దీనిలో భాగం గానే హైదరాబాద్ లో అన్ని చ్యానెల్స్ కు వెళుతూ ఇంటర్‌వ్యూ లు ఇస్తూ ఉంది. ఈ పుస్తకం కూడా పవన్ కల్యాణ్ పైనేనా అని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ప్రశ్నించినా స్పందించని రేణుదేశాయ్ తాజాగా ఒక మీడియా చ్యానెల్ లో దీని గురించి స్పష్టత ఇచ్చింది… నేను పాత జీవితాన్ని వదిలేసి చాలా కాలం అయ్యింది…వాళ్ళు మాత్రం ఇంకా వడాల లేదు అంటూ స్పష్టంగా చెప్పింది…. త్వరలో పెళ్లి చేసుకుని కొత్త జీవితంలో అడుగు పెట్టా బోతున్న రేణుదేశాయ్ కి అటు జీవితం లోను…ఇటు కెరీర్ పరంగా కూడా విజయం చేకూరాలని కోరుకుందాం…

Loading...