రేణుదేశాయ్ ని రీలాంచ్ చేసిన కల్యాణ్

90
Renu desai relaunched
Renu desai relaunched

Renu desai relaunched | రేణుదేశాయ్ ని రీలాంచ్ చేసిన కల్యాణ్ …. పవన్ కల్యాణ్ బద్రి తో టాలీవుడ్ లో పాప్యులర్ అయ్యింది రేణుదేశాయ్. ఆ తరువాత జానీ లో కూడా పవన్ కల్యాణ్ తో జత కట్టింది. తరువాత పవన్ కల్యాణ్ ను పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. అయినా అప్పుడప్పుడు కవితలతో సోషల్ మీడియా లో హల్‌చల్ చేస్తూనే ఉంది. పవాల్ కల్యాణ్ నుంచి విడిపోయిన చాలా కాలం తరువాత మరో పెళ్లి చేసుకోబొతుంది రేణుదేశాయ్.

అలాగే కెరీర్ ను కూడా ముందుకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఒక సినిమా కు డైరెక్షన్ చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి.. ఇప్పుడు కళామందిర్ కళ్యాణ్ యాడ్ ఫిల్మ్ లో కనిపించబోతుంది రేణుదేశాయ్..కళామందిర్ కళ్యాణ్  ‘కాంచీపురం వరమహలక్ష్మి సిల్క్స్’ కి రేణు ని బ్రాండ్ అంబాసిడర్ గా తీసుకుని ఈ మధ్యే ఒక యాడ్ ఫిల్మ్ కూడా షూట్ చేశారు…. త్వరలో ఈ యాడ్ టెలికాస్ట్ కానుంది… దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతూ వైరల్ అవుతున్నాయి… రేణుదేశాయ్ నటిస్తున్న మొదటి యాడ్ బ్రాండ్ ఇదే…. ఇక ముందు ఎన్ని యాడ్స్ లో నటిస్తున్‌దో చూడాలి….

Loading...