రజినీకాంత్ పెట్టా సెన్సార్ రిపోర్ట్

137
Rajinikanth Petta Movie Censor Report
Rajinikanth Petta Movie Censor Report


Rajinikanth Petta Movie Censor Report | రజినీకాంత్ పెట్టా సెన్సార్ రిపోర్ట్ | సూపర్ స్టార్ రజినీకాంత్ 2.0 సినిమాతో భారీ విజయాన్ని ఆయన ఖాతాలో వేసుకున్నారు. 2.౦ సినిమా భారీ విజయాన్ని సాధించడంతో ఆయన నటిస్తున్న తదుపరి పెట్టా సినిమాపై అందరిలోనూ అంచనాలు భారీగా పెరిగాయి. కార్తీక్ సుబ్బా రాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మొదటిసారిగా సిమ్రాన్, త్రిష రజినీకి జోడిగా నటిస్తున్నారు. తమిళ స్టార్ హీరో, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి అలాగే, మేఘ ఆకాష్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

ఇదిలా ఉంటె, ఈ సినిమాకి సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సినిమాలో కొన్ని పోరాట సన్నివేశాల్ని తొలగిస్తే సినిమాకి క్లీన్ యూ సర్టిఫికెట్ ఇస్తామని అన్నారట సెన్సార్ సభ్యులు. కానీ చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ అందుకు ఒప్పుకోకపోవడంతో ఈ చిత్రం యూ/ఏ సెర్టిఫికెట్ పొందింది. యువ సంగీత దర్శకుడు అనిరుద్ సంగీతాన్ని సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి పండగ సందర్బంగా భారీ స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహా చేస్తున్న దర్శకనిర్మాతలు. మరి ఈ చిత్రం ప్రేక్షకులని ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి!

Loading...