కమీడియన్ శ్రీనివాస రెడ్డి ప్రధాన పాత్రలో చేడ్డి గ్యాంగ్… సంక్రాంతికి విడుదల

39
కమీడియన్ శ్రీనివాస రెడ్డి ప్రధాన పాత్రలో చేడ్డి గ్యాంగ్... సంక్రాంతికి విడుదల
కమీడియన్ శ్రీనివాస రెడ్డి ప్రధాన పాత్రలో చేడ్డి గ్యాంగ్… సంక్రాంతికి విడుదల

కమీడియన్ శ్రీనివాస రెడ్డి ప్రధాన పాత్రలో చేడ్డి గ్యాంగ్… సంక్రాంతికి విడుదల…  కమీడియన్ శ్రీనివాస రెడ్డి ప్రధాన పాత్రలో శృతి, కావ్య, దేవి, అమర్‌, ప్రదీప్‌వర్మ, ఉదయ్‌, అభి, సి.టి., ఖాదర్‌, లక్ష్మి, వీణ, జాస్మిన్‌ ఇతర ముఖ్య పాత్రలలో తెరకెక్కుతున్న చిత్రం చేడ్డి గ్యాంగ్…. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది…చేడ్డి గ్యాంగ్ అనగానే ..ఇదేదో దొంగల ముఠా సినిమా అనుకోవటం సహజమే… కానీ ఈ సినిమాకు, హైదరాబాద్ లో పట్టుబడ్డ చేడ్డి గ్యాంగ్ కు ఎలాంటి సంబంధం లేదు.

కథ విషయానికి వస్తే.. హైదరాబాద్ లో ఒక సాఫ్ట్‌వేర్ కంపనీ తన ఉద్యోగులు పది మందిని కేరళ టూర్ కి పంపుతుంది. అక్కడ కు వెళ్ళిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు అనుకోకుండా ఒక జాతరలో సంప్రాయాలకు విరుద్ధంగా ప్రవర్తించి ఇరుక్కుపోతారు… అక్కడి నుంచి వారెలా బయటపడతారు అనేది సినిమా కథాంశం…. సినిమాను సారధి స్టూడియో లో, కేరళ లోని లొకేషన్స్ లో చిత్రీకరించారు…. ఇప్పటికయితే ఈ సినిమా సంక్రాంతికి విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారు యూనిట్… మరి అప్పుడు చాలా భారీ బడ్జెట్ సినిమాలు ఉన్నాయి…. వీళ్ళు సంక్రాంతి కి విడుదల చేస్తారో పొస్ట్‌పోన్ చేస్తారో చూడాలి….

Loading...