పొగిడేస్తే.. చోటిస్తుందా... వరుణ్‌ ధావన్‌ మంచి ప్లానే వేసాడు.. నటీనటులకు నేషనల్ లెవెల్ లో గుర్తింపు రావాలని కలలు కంటుంటారు.. దానికి తగ్గ ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు..

వరుణ్‌ ధావన్‌

వరుణ్‌ ధావన్‌

వరుణ్‌ ధావన్‌

నటీనటులకు నేషనల్ లెవెల్ లో గుర్తింపు రావాలని కలలు కంటుంటారు.. దానికి తగ్గ ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు.. ఈ క్రమంలోనే పరభాషా పరిశ్రమను అందులో ఉన్న డైరెక్టర్స్ ను తెగ పొగిడేస్తుంటారు.. ఈ కోవకు చెందాడు బాలీవుడ్‌ నటుడు వరుణ్‌ ధావన్‌. తన దృష్టి దక్షిణాది దర్శకులపై పడింది. వరుణ్‌ ధావన్‌ కథానాయకుడిగా నటించిన ‘అక్టోబర్’ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు మంచి టాక్‌ వస్తోంది. ఈ దిశలో భాగంగా వరుణ్ తెలుగు పరిశ్రమపై తనకున్న ఆసక్తిని తెలిపారు.   మొదటి నుంచీ బాలీవుడ్‌ చిత్రాల్లో నటిస్తూ వచ్చిన వరుణ్‌ ధావన్‌ ఇప్పుడు ఇద్దరు దక్షిణాది అగ్ర దర్శకులతో కలిసి పనిచేయాలని ఉందంటున్నారు.  భవిష్యత్తులో తనకు రాజమౌళి, శంకర్‌తో కలిసి పనిచేయాలని ఉందని తెలిపారు. రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’  శంకర్‌ తెరకెక్కించిన ‘రోబో’, ‘ఐ’ సినిమాలకు కూడా అంతర్జాతీయ గుర్తింపు లభించింది. మరి ఇంతటి అద్భుత దృశ్యకావ్యాలను తెరకెక్కించే ఇలాంటి దర్శకులతో కలిసి పనిచేయాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. 

వరుణ్‌ ధావన్‌

వరుణ్‌ ధావన్‌

వరుణ్‌ ధావన్‌

అంతేకాదు మన తెలుగు చిత్ర పరిశ్రమ గురించి వరుణ్‌ ధావన్‌ చాలానే చెప్పారు. ‘తెలుగులో కానీ తమిళంలో కానీ హీరోగా తెరంగేట్రం చేయాలనుకున్నాను. నాకు రామ్‌చరణ్‌ మంచి స్నేహితుడు. నన్ను తెలుగు నేర్చుకోమని సలహా ఇచ్చాడు. దక్షిణాది సినిమాలు చూడటమంటే చాలా ఇష్టం. అక్కడి సినిమాలు ప్రభావితం చేసేలా ఉంటాయి. అర్జున్‌ రెడ్డి, మెర్క్యురీ అలాంటి సినిమాలే. ఇక మలయాళ సినిమాల గురించి చెప్పాలంటే వాటిలో కంటెంటే కింగ్‌.’ అని చెప్పుకొచ్చారు వరుణ్‌. తెలుగు పరిశ్రమను ఇంత పొగిడేస్తుంటే వరుణ్ ధావన్ కు చోటివ్వక పోతుందా..

Loading...

You may also like