మీరిద్దరేనా మరి నేనూ... అని అడిగిన సూర్య -- తన స్నేహాన్ని టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు పరిచయం చేసే నటి ఎవరైనా ఉన్నారా అంటే లక్ష్మి మంచు పేరే చెప్పేస్తారు అంతా

తన స్నేహాన్ని టాలీవుడ్ నుంచి  హాలీవుడ్ వరకు పరిచయం చేసే నటి ఎవరైనా ఉన్నారా అంటే  లక్ష్మి మంచు పేరే చెప్పేస్తారు అంతా... ఎందుకంటే ఈమెకు స్నేహితులు ఎక్కువ.. తెలుగు ఇషా రెబ్బ నుంచి అమెరికా ప్రెసిడెంట్ తనయి ఇవాంక వరకు అందరూ తెలిసినవారే... తమ మధ్య ఉన్న స్నేహాన్ని  సునాయాసంగా సోషల్ మీడియా ద్వారా తరచూ తెలుపుతుంటారు లక్ష్మి.  ఇదిలా ఉంటె... బాలీవుడ్‌లో విద్యా బాలన్‌ నటించిన ‘తుమారీ సులు’ సినిమాకు రీమేక్‌గా జ్యోతిక ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం కాట్రిన్ మొళి. ఈ సినిమాలో మంచు లక్ష్మి కీలక పాత్ర పోషిస్తోంది.   అయితే ఈ సినిమాలో జ్యోతికతో కలిసి నటించడం నిజంగా అద్భుతమని.. జ్యోతికకు తాను వీరాభిమానని.. ఈ సినిమాతో ఆమెపై ఉన్న అభిమానం మరింత పెరిగిందని ఇటీవల మంచు లక్ష్మి వెల్లడించిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె మరో ట్వీట్ చేసింది. పాత మిత్రులను కలిసినపుడు సూర్య నా అభిమాన నటుడు మాత్రమే కాదు మంచి మనిషి అనిపిస్తుంది. అయితే ఇప్పుడు నా మైండ్‌ని మార్చుకున్నాను. నేను ఎప్పటికీ 100 శాతం జ్యోతికకు అభిమానిని అని ట్వీట్‌లో పేర్కొంది లక్ష్మి. ఈ ట్వీట్‌కి స్పందించిన హీరో సూర్య.. లక్ష్మికి రిప్లై ఇచ్చారు. నీకూ, జ్యోతికకు మధ్య ఉన్న బంధాన్ని చూస్తుంటే చాలా మంచిగా అనిపిస్తోంది. కాట్రిన్ మొళి సెట్స్‌పై నువ్వే లైఫ్ అని జ్యోతిక చెప్తూ ఉంటుంది. మేమెప్పుడూ చూడనటువంటి బెస్ట్ ప్లేసెస్‌ని చెన్నైలో చూపించినందుకు థ్యాంక్స్. దయచేసి నన్ను కూడా నీ ఫేవరెట్ లిస్ట్‌లో ఉండనివ్వు లక్ష్మి అని రిప్లై ఇచ్చాడు సూర్య.

YOUR REACTION?


You may also likeFacebook ConversationsDisqus Conversations