ఈ సారి ప్రేక్షకులు జగ్గు భాయ్ ని క్షమించరా..? వెండితెర‌పై కమర్షియల్ హీరోగా కంటే ఫ్యామిలీ హీరో గా కొనసాగారు నటుడు జగపతి బాబు

ఈ సారి ప్రేక్షకులు జగ్గు భాయ్ ని క్షమించరా..?  వెండితెర‌పై కమర్షియల్  హీరోగా కంటే ఫ్యామిలీ హీరో గా కొనసాగారు నటుడు జగపతి బాబు.   అయితే `లెజెండ్‌`తో విల‌న్‌గా పరిచ‌య‌మైన త‌ర్వాత మాత్రం ప్రేక్షకులను భయపెట్టే పాత్ర‌లు ఎంచుకుంటూ వ‌రుస అవ‌కాశాలు అందుకుంటున్నారు. ప్ర‌స్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా న‌టించిన `సాక్ష్యం` సినిమాలో జగపతి బాబు విల‌న్‌గా న‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆ పాత్ర గురించి జ‌గ‌ప‌తి బాబు స్పందించారు. `ఫ్యామిలీ హీరోనైన నేను ఇటీవ‌లి కాలంలో విల‌న్‌గా నటిస్తున్నాను. తాజాగా `సాక్ష్యం` సినిమాలో కూడా ప్ర‌తినాయ‌క పాత్ర పోషించాను. ఈ సినిమాలో విల‌న్ చాలా క్రూరుడు. ప్ర‌పంచంలో ఇంత కంటే నీచుడు ఉండడు. ఇప్ప‌టివ‌ర‌కు నేను పోషించిన విల‌న్ పాత్ర‌ల్ని ప్రేక్ష‌కులు క్ష‌మించారు. కానీ, ఈ సారి మాత్రం కుద‌ర‌దు. వీడు చాలా పెద్ద వెధ‌వ‌. అతనికి డ‌బ్బు త‌ప్ప మ‌రో పర్ప‌స్ ఉండ‌ద‌ని జగ్గు భాయ్ సాక్ష్యం సినిమలోని తన పారా తీరును వివరించారు. 

YOUR REACTION?


You may also likeFacebook ConversationsDisqus Conversations