Priya varrier Perfume Ad Trolled Again | మరోసారి బుక్కయిన ప్రియా వారియర్ ... సంవత్సరం క్రితం ప్రియా వారియర్ ఒక్క రాత్రిలో

Priya varrier Perfume Ad Trolled Again | మరోసారి బుక్కయిన ప్రియా వారియర్ ....  సంవత్సరం క్రితం ప్రియా వారియర్ ఒక్క రాత్రిలో ఆలిండియా స్టార్ అయిపొయింది. ఈమధ్యే విడుదలైన ఆమె మొదటి సినిమా "ఓరు ఆధార్ లవ్" డిజాస్టర్ అయింది. ఈ సినిమా విడుదలకు ముందు సౌత్ లో వచ్చిన ఆఫర్స్ అన్ని వదులుకున్న ప్రియా వారియర్ బాలీవుడ్ లో మాత్రం శ్రీదేవి బంగళా అనే సినిమా చేసింది. ఆ సినిమా ఇంకా విడుదల కాలేదు. ఓరు ఆధార్ లవ్ డిజాస్టర్ కావటంతో పాటు ప్రియా వారియర్ నటిగా అస్సలు పనికి రాదని నిర్మాతలు డిసైడ్ అయిపోయారు.. ఇంతకు ముందు కాల్ చేసి, వెంటబడిన నిర్మాతలు ఆమె మొబైల్ బ్లాక్ చేశారంటేనే అర్ధం చేసుకోవచ్చు పరిస్థితి ఎలా ఉందొ. అయితే ఈమెకున్న పాపులారిటీ ని కాష్ చేసుకోవటానికి యాడ్ ఏజెన్సీ లు మాత్రం పోటీ పడుతున్నట్టే ఉన్నాయి. ఈకోవలోనే రీసెంట్ గా ఒక పెర్ఫ్యూమ్ యాడ్ చేసింది ప్రియా వారియర్. ఈ ఫోటోలు నెట్లో పోస్ట్ చేస్తూ "" అని సంస్థవారిచ్చిన మెసేజ్ ని కూడా పోస్ట్ చేసింది ప్రియా వారియర్. దీంతో ఎప్పుడూ రెడీగా వుండే నెటిజన్లు ట్రోల్ల్స్ చేయటం మొదలెట్టారు. ఎంతలా అంటే నటించటం పక్కన పెట్టు కనీసం కాపీ పేస్ట్ చేయటం ముందు నేర్చుకో అని విరుచుకుపడ్డారు. కొంత సేపటికి తప్పు తెలుసుకున్న ప్రియా వారియర్ పోస్ట్ సరి చేసుకుంది...

YOUR REACTION?


You may also like



Facebook Conversations



Disqus Conversations