Majili movie Amazon Prime | కొత్త రూల్స్ మజిలీ కి ప్లస్ ... నాగ చైతన్య, సమంత జంటగా తెరకెక్కిన మజిలీ సినిమా ఈ రూల్స్ అమల్లోకి వచ్చాక మొదటి హిట్

Majili movie Amazon Prime | కొత్త రూల్స్ మజిలీ కి ప్లస్ ....  నిన్న మొన్నటి వరకు సినిమా విడుదలైన 5 వారాల్లోనే (కొన్ని సార్లు 50 రోజులు) అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్ లాంటి స్ట్రీమింగ్ ప్లాటుఫార్మ్స్ లో దర్శనమిచ్చేది. ఈ డిజిటల్ ప్లాటుఫార్మ్స్ వల్ల ఈ సంవత్సరం ఇప్పటికే 96 , కెజిఎఫ్, ఎఫ్ 2 లాంటి సినిమాలు దెబ్బ తిన్న విషయం విదితమే.  చాలా మంది నెలలోనే స్ట్రీమింగ్ కావటం తో పూర్తిగా థియేటర్స్ కి వెళ్ళటం మానేశారు. దానికి వివిధ కారణాలుండచ్చు. ఈమధ్యే ఈ డిజిటల్ ప్లాటుఫార్మ్స్ గురించి స్పందించిన నిర్మాతల మండలి, ఫిలిం ఛాంబర్ కొత్త రూల్స్ ని అందుబాటులోకి తెచ్చింది. ఇకపై ఏ సినిమా అయినా 8 వారాల వరకు స్ట్రీమ్ చేయకుండా నిర్ణయం తీసుకుంది. ఈ రూల్స్ ఈ నెల మొదటి నుంచి అమల్లోకి వస్తాయి. నాగ చైతన్య, సమంత జంటగా తెరకెక్కిన మజిలీ సినిమా ఈ రూల్స్ అమల్లోకి వచ్చాక మొదటి హిట్ అవటం తో ఈ రూల్ వల్ల లాభపడుతున్న మొదటి సినిమా మజిలీ అని చెప్పవచ్చు. నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, ఓవర్సీస్ లో కూడా మంచి కలెక్షన్లను సాధిస్తుంది. 

YOUR REACTION?


You may also like



Facebook Conversations



Disqus Conversations