బాల సినిమాలో తెలుగమ్మాయి | Director Bala picked Bindu Madhavi -- తెలుగమ్మాయిలు చాలా మంది ఈ పదేళ్లలో టాలీవుడ్ లో అడుగుపెట్టారు

బాల సినిమాలో తెలుగమ్మాయి | Director Bala picked Bindu Madhavi .... తెలుగమ్మాయిలు చాలా మంది ఈ పదేళ్లలో టాలీవుడ్ లో అడుగుపెట్టారు. కొంత మంది కనుమరుగైతే మరికొంత మంది కోలీవుడ్ కి మకాం మార్చేశారు. ఒక్క ఈషా రెబ్బానే ఇంకా టాలీవుడ్ లో అవకాశాల కోసం ప్రయత్నిస్తుంది. కలర్స్ స్వాతి, శ్రీ దివ్య లాంటి వారు చాలా మంది కోలీవుడ్ లో స్టార్ స్టేటస్ సంపాదించారు. వారికి కూడా తెలుగులో అవకాశాలు లేవు. వీరి కోవలోనే రాయలసీమ పిల్ల బిందుమాధవి కూడా తెలుగులోనే తెరంగేట్రం చేసినా, మెల్లగా కోలీవుడ్ కి షిఫ్ట్ అయింది. ఇక అసలు విషయానికి వస్తే, గతేడాది విడుదలై టాలీవుడ్ లో భారీ విజయం సాధించిన అర్జున్ రెడ్డి సినిమా హిందీ తమిళం లో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. షాహిద్ కపూర్, కైరా అద్వానీ జంటగా తెరకెక్కిన హిందీ రీమేక్ "కబీర్ సింగ్" ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా వుంది.

ఇక తమిళంలో ఈసినిమా వర్మ పేరుతొ బాలా డైరెక్షన్ లో తెరకెక్కిన విషయం విదితమే. హీరో విక్రమ్ కుమారుడు ధృవ్ హీరోగా తెరకెక్కింది ఈ చిత్రం. మొదటి నుంచి ఎన్నో విమర్శలు ఎదుర్కున్న ఈ చిత్రం ఎట్టకేలకు చెత్త బుట్టలో చేరింది. ఫైనల్ ఔట్పుట్ నచ్చక నిర్మాతలు, విక్రమ్ ఈ సినిమా మొత్తాన్ని మరోసారి రీషూట్ చేసే ప్రక్రియ మొదలు పెట్టారు. ఇందులో భాగం గానే దర్శకుడు బాల తో పాటు అతని టీమ్ మొత్తాన్ని పక్కన పెట్టి రీషూట్ చేస్తున్నారు. నిజానికి బాలా లాంటి క్లాస్ దర్శకుడితో ఇలాంటి కల్ట్ మూవీ చేయాలనుకోవడం ఎవరి తప్పు ?? .. ఏది ఎలా వున్నా ఆ షాక్ నుంచి కోలుకున్న బాల తన తదుపరి సినిమాలపై దృష్టి సారించాడు. కెరీర్ మొదట్లో తనకు బ్రేక్ ఇచ్చిన బాలాకు ఇప్పటికే సూర్య ఒక అవకాశం ఇచ్చాడు. అయితే ఈ సినిమా కంటే ముందు బాల ఒక మల్టి స్టారర్ సినిమా చేయనున్నాడు. ఆర్యా, అథర్వా హీరోలుగా తెరకెక్కనున్న ఈ సినిమాకోసం హీరోయిన్ గా తెలుగమ్మాయి బిందు మాధవిని సెలెక్ట్ చేసుకున్నాడు బాల. అర్జున్ రెడ్డి షాక్ కి ఈ సినిమాతో సమాధానం చెప్పే ఆలోచనలో ఉన్న బాల ఆశలన్నీ ఇప్పుడీసినిమాపైనే ఉన్నాయి. బెస్ట్ ఆఫ్ లక్ బాల & బిందు...

YOUR REACTION?


You may also likeFacebook ConversationsDisqus Conversations