26 న విడుదలకు సిద్దమైన గీతా చలో | Rashmika Mandanna, Geetha Chalo, Geetha Chalo release date, Geetha Chalo movie, Geetha Chalo movie release date

26 న విడుదలకు సిద్దమైన గీతా చలో | Rashmika Mandanna Geetha Chalo ....చలో తో టాలీవుడ్ లో అడుగు పెట్టిన కన్నడ బ్యూటీ రష్మిక మందన్న వరుస హిట్లతో మంచి ఊపు మీదుంది. గీత గోవిందం సినిమా భారీ హిట్ తో స్టార్ స్టేటస్ సంపాదించింది రష్మిక. ఇప్పుడు రష్మిక స్టార్ స్టేటస్ ని కాష్ చేసుకునే పనిలో పడ్డారు కన్నడ నిర్మాతలు. గణేష్ హీరోగా రష్మిక హీరోయిన్ గా కన్నడ లో హిట్ అయిన చమక్ సినిమా డబ్బింగ్ ముగించుకుని తెలుగులో విడుదలకు సిద్ధమైంది. చలో,గీతా గోవిందం టైటిల్స్ రెండు కలిపి ఈ డబ్బింగ్ సినిమాకు గీతా చలో అనే టైటిల్ ఫిక్స్ చేసారు. నిన్న హైదరాబాద్ లో ప్రీరిలీజ్ ఫంక్షన్ ఘనంగా జరిగింది. ఈనెల 26 న ఈ సినిమా థియేటర్స్ కు రానుంది. ఇదే బాటలో కెజిఎఫ్ హీరో యష్ నటించిన కొన్ని కన్నడ సినిమాలు కూడా డబ్బింగ్ బాట పట్టాయి.

YOUR REACTION?


You may also likeFacebook ConversationsDisqus Conversations