Connect with us

Gossips

డేటింగ్ సైట్లో హీరోయిన్ .. ఫోటో పెట్టింది కూతురేనట

Suchitra Krishnamoorthy

Suchitra Krishnamoorthy | తెలుగు బ్రాహ్మిన కుటుంబానికి చెందిన సుచిత్ర కృష్ణమూర్తి 90 వ దశకంలో నటిగా, గాయనిగా సంచలనం సృష్టించింది. విచిత్రమేమిటంటే అమ్మడు మలయాళ, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో నటించింది కానీ, మాతృబాష తెలుగులో అసలు అడుగే పెట్టలేదు. అప్పట్లో కుర్రకారుని కుర్రోతలూగించిన ఆమె ఆల్బమ్స్ లో కూడా ఎక్కడ తెలుగు వినిపించలేదు. ఆ తరువాత దర్శకనిర్మాత శేఖర్ కపూర్ ని పెళ్లి చేసుకుని, విడాకులు కూడా తీసుకుంది. చాలా ఏళ్లపాటు వీరు విడాకులకు, ఆస్తికోసం కోర్టుల చుట్టూ తిరగటం కూడా అప్పట్లో వైరల్ అయింది. వీరిద్దరికి కావేరీ కపూర్ అనే కూతురు కూడా ఉంది. ఇక అసలు విషయానికి వస్తే …

తాజాగా సుచిత్ర కృష్ణమూర్తి ‘భూల్ బుల్లయ్య 2’ లో నటించింది. ఈ సందర్భంగా కొన్ని ఇంటర్వ్యూలు కూడా ఇస్తుంది. తాజా ఇంటర్వ్యూలో అమ్మడు షాకింగ్ విషయాలు కొన్ని బయటపెట్టింది. శేఖర్ కపూర్ తో విడాకుల తరువాత ఆమెను డేటింగ్ చేయమని కూతురు బలవంతపెట్టిందట. డేటింగ్ సైట్లో ఫోటో పెట్టి ప్రొఫైల్ కూడా కూతురే క్రియేట్ చేసిందని, ఆ కారణం గా ఓ వ్యక్తితో కొంతకాలం రిలేషన్ లో ఉన్నానని, ఆ తరవాత బ్రేకప్ చెప్పానని అంటోంది సుచిత్ర. ఆ తరువాత ఫోన్ కి అసభ్యకరమైన మెస్సేజ్ లు రావటంతో డేటింగ్ సైట్ నుంచి ప్రొఫైల్ తొలగించిందట.

Advertisement

Gossips

పక్కా కమర్షియల్ పెయిర్ … ఖర్చంతా నెట్ ఫ్లిక్స్ పైనే?

Nayanthara Vignesh Shivan Netflix

Nayanthara Vignesh Shivan Netflix | నయనతార సినీ కెరీర్ టాప్ రేంజ్ లో కొనసాగుతున్నా, అమ్మడి పర్సనల్ లైఫ్ లో మాత్రం చాలా హర్డిల్స్ ఉన్నాయి. శింబు తో లవ్, బ్రేకప్ ఆ తరువాత ప్రభుదేవాతో బ్రేకప్. ఇప్పుడు ఎనిమిదేళ్లనుంచి ప్రేమలో ఉన్న విగ్నేష్ శివన్ తోపెళ్లి. దాదాపు పదేళ్లనుంచి నయనతార మీడియా ముందుకు రావటానికి భయపడేది. అందుకే ఎంత పెద్ద సినిమా చేసినా మీడియా ముందుకు రాలేదు. అసలు ప్రమోషన్స్ లో ఎప్పుడూ కనిపించలేదు నయనతార. ఇందులో పెద్ద లాజిక్ ఏమి లేదు. గత లవ్ స్టోరీలు, బ్రేకప్ ల గురించి ప్రశ్నలు ఎదురవుతాయనేదే కారణం. ఇప్పుడు పెళ్లయిపోయింది కనుక ఇకముందు నయనతార ప్రమోషన్స్ లో కూడా కనిపిస్తుందని, మీడియా లో ఇంటర్వ్యూ లు కూడా ఇస్తుందని కోలీవుడ్ టాక్. ఇక అసలు విషయానికి వస్తే…

జూన్ 9 న పెళ్లి చేసుకున్న నయనతార, విగ్నేష్ శివన్ జంట, తమ పెళ్లి హోల్ సేల్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ కు ఇవ్వటం జరిగింది. ఇదొక 100 కోట్ల డీల్ అని, ఈ డీల్ క్లోజ్ చేసింది గౌతమ్ మీనన్ అని కోలీవుడ్ టాక్. మహాబలిపురం రిసార్ట్ లో అంగరంగ వైభవంగా జరిగిన ఈ పెళ్ళికి దాదాపు 25 కోట్లు ఖర్చయ్యాయని, వీటిలో ఒక్క పైసా కూడా నయన్, విగ్నేష్ తీయలేదని, మొత్తం ఖర్చు నెట్ ఫ్లిక్స్ దే అని సమాచారం. అయితే ఈ 25 కోట్లు ప్యాకేజీ లో భాగమా లేక అదనమా అనేది తెలియాల్సి ఉంది. ఈ పెళ్ళికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు త్వరలోనే నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి రానున్నాయి. ఇంతకుముందు కత్రినా కైఫ్ వెడ్డింగ్ రైట్స్ 100 కోట్లకు అమ్ముడుపోయాయి. ఇప్పుడు నయనతార ఆ రికార్డు ని బీట్ చేసినట్టే కనిపిస్తుంది.

Continue Reading

Gossips

పాప ఆశలపై నీళ్లు .. ఇకనైనా ఎన్టీఆర్ 30 కి ఓకే చెబుతుందా

Janhvi Kapoor

Janhvi Kapoor | అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ ‘ధఢక్’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అది ఓ మరాఠీ సినిమా రీమేక్. ఆ తరువాత ‘ఘోస్ట్ స్టోరీస్’, ‘కార్గిల్ గర్ల్’, రూహి వంటి సినిమాల్లో నటించినా సాలిడ్ హిట్ మాత్రం ఇంకా జాన్వికి రాలేదు. ఇప్పుడు కూడా ఓ నాలుగు సినిమాలు చేతిలో ఉన్నా, ఒక్కటీ స్టార్ హీరో సినిమా కాదు. అమ్మడి యాక్టింగ్ టాలెంట్, డాన్సింగ్ టాలెంట్ కి వంక పెట్టాల్సిన అవసరమే లేదు. అయినా బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు రావట్లేదు. మరోపక్క సౌత్ నుంచి పాన్ ఇండియా స్థాయి ఆఫర్లు వస్తున్నా అమ్మడు దాగుడుమూతలు ఆడుతుంది. ఎన్టీఆర్ సినిమాలో జాన్వీ టాలీవుడ్ డెబ్యూ చేయనుందని వార్తలొచ్చాయి. అయితే అమ్మడు ఎస్/నో చెప్పకుండా డైలమాలో పెట్టింది. దీనికి ఓ కారణముందంటున్నారు జాన్వీ సన్నిహితులు…

జాన్వికి మంచి ఆఫర్స్ వస్తున్నా బాలీవుడ్ లో సాలిడ్ హిట్ పడలేదు. ఇక్కడ బ్లాక్ బస్టర్ కొట్టి సౌత్ లో ఎంట్రీ ఇవ్వాలనుకుంటుందట జాన్వీ. ‘గుడ్ లక్ జెర్రీ’ సినిమాపైనే జాన్వీ ఆశలన్నీ పెట్టుకుంది. నయనతార నటించిన ‘కోలమవు కోకిల’ సినిమా కు హిందీ రీమేక్ ఈ సినిమా. సినిమాలో సబ్జెక్టు ఉండటం, పైగా ఔట్పుట్ సంతృప్తికరంగా ఉండటంతో ఈ సినిమాతోనే మొదటి బ్లాక్ బస్టర్ కొట్టాలనుకుంది జాన్వీ కపూర్… కట్ చేస్తే… జులై 29 నుంచి ‘గుడ్ లక్ జెర్రీ’ హాట్ స్టార్ లో స్ట్రీమ్ చేయనున్నట్టు అధికారిక ప్రకటన వెలువడింది.

ఇప్పుడు కొరటాల అఫర్ కు ఓకే చెబుతుందని, ఎన్టీఆర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఖాయమని అంటున్నారు సినీ పండితులు.

 

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

Janhvi Kapoor

Continue Reading

Gossips

దసరాకి మరోసారి?

Chiranjeevi Balakrishna

Chiranjeevi Balakrishna | 1974 లో తాతమ్మ కల సినిమాతో బాలయ్య, 1978 లో ప్రాణం ఖరీదు సినిమాతో చిరంజీవి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. అప్పటికి ఎన్టీఆర్ ఏఎన్నార్ ల జమానా చివర స్టేజి లో, కృష్ణ శోభన్ బాబు జమానా ఫుల్ స్వింగ్ లో ఉంది. చిరంజీవి మొదట చిన్నచిన్న పాత్రలలో, నెగటివ్ రోల్స్ లోనూ నటించాడు. నిజానికి 1979 లోనే పునాది రాళ్ళూ తో హీరో అయినా మంచి బ్రేక్ రావటానికి నాలుగేళ్లు పట్టింది. బాలయ్య పరిస్థితి వేరు ఎన్టీఆర్ వారసుడిగా హీరో గానే ఎంట్రీ ఇచ్చాడు బాలయ్య. 1983 లో చిరంజీవికి, 1984 లో బాలయ్యకు బ్లాక్ బస్టర్స్ తగిలి టాలీవుడ్ లో టాప్ స్టార్స్ అయ్యారు.

అప్పటినుంచి ఎన్నోసార్లు బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డారు బాలయ్య, చిరంజీవి. గత 10 , 15 ఏళ్లలో వీరిద్దరి మధ్య పోటీ పెద్దగా లేదనే చెప్పాలి. చిరంజీవి రీఎంట్రీ తరువాత ‘ఖైదీ నెంబర్ 150’, ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ బాక్స్ ఆఫీస్ వద్ద పోటీపడి రెండూ విజయవంతమయ్యాయి. మళ్ళీ ఇప్పుడు దసరాకి వీరిద్దరూ పోటీపడే అవకాశం ఉంది. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ సినిమా ను దసరాకు విడుదల చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు. అలాగే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య హీరోగా తెరకెక్కుతున్న సినిమాకూడా దసరా టార్గెట్ నే ఎంచుకుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే చిరు బాలయ్య పోరు మరోసారి బాక్స్ ఆఫీస్ వద్ద కనకవర్షం కురిపించటం ఖాయం.

Chiranjeevi Balakrishna

Continue Reading

Trending