Gossips
పక్కా కమర్షియల్ పెయిర్ … ఖర్చంతా నెట్ ఫ్లిక్స్ పైనే?

Nayanthara Vignesh Shivan Netflix | నయనతార సినీ కెరీర్ టాప్ రేంజ్ లో కొనసాగుతున్నా, అమ్మడి పర్సనల్ లైఫ్ లో మాత్రం చాలా హర్డిల్స్ ఉన్నాయి. శింబు తో లవ్, బ్రేకప్ ఆ తరువాత ప్రభుదేవాతో బ్రేకప్. ఇప్పుడు ఎనిమిదేళ్లనుంచి ప్రేమలో ఉన్న విగ్నేష్ శివన్ తోపెళ్లి. దాదాపు పదేళ్లనుంచి నయనతార మీడియా ముందుకు రావటానికి భయపడేది. అందుకే ఎంత పెద్ద సినిమా చేసినా మీడియా ముందుకు రాలేదు. అసలు ప్రమోషన్స్ లో ఎప్పుడూ కనిపించలేదు నయనతార. ఇందులో పెద్ద లాజిక్ ఏమి లేదు. గత లవ్ స్టోరీలు, బ్రేకప్ ల గురించి ప్రశ్నలు ఎదురవుతాయనేదే కారణం. ఇప్పుడు పెళ్లయిపోయింది కనుక ఇకముందు నయనతార ప్రమోషన్స్ లో కూడా కనిపిస్తుందని, మీడియా లో ఇంటర్వ్యూ లు కూడా ఇస్తుందని కోలీవుడ్ టాక్. ఇక అసలు విషయానికి వస్తే…
జూన్ 9 న పెళ్లి చేసుకున్న నయనతార, విగ్నేష్ శివన్ జంట, తమ పెళ్లి హోల్ సేల్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ కు ఇవ్వటం జరిగింది. ఇదొక 100 కోట్ల డీల్ అని, ఈ డీల్ క్లోజ్ చేసింది గౌతమ్ మీనన్ అని కోలీవుడ్ టాక్. మహాబలిపురం రిసార్ట్ లో అంగరంగ వైభవంగా జరిగిన ఈ పెళ్ళికి దాదాపు 25 కోట్లు ఖర్చయ్యాయని, వీటిలో ఒక్క పైసా కూడా నయన్, విగ్నేష్ తీయలేదని, మొత్తం ఖర్చు నెట్ ఫ్లిక్స్ దే అని సమాచారం. అయితే ఈ 25 కోట్లు ప్యాకేజీ లో భాగమా లేక అదనమా అనేది తెలియాల్సి ఉంది. ఈ పెళ్ళికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు త్వరలోనే నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి రానున్నాయి. ఇంతకుముందు కత్రినా కైఫ్ వెడ్డింగ్ రైట్స్ 100 కోట్లకు అమ్ముడుపోయాయి. ఇప్పుడు నయనతార ఆ రికార్డు ని బీట్ చేసినట్టే కనిపిస్తుంది.
