Gossips
రాశి ఖన్నా మెరుపులు ‘పక్కా కమర్షియల్’

Raashi Khanna Pakka commercial | ఎన్ని సినిమాలు చేసినా, రాశి ఖన్నా కు స్టార్ స్టేటస్ మాత్రం దక్కలేదు. తెలుగుతో పాటు తమిళం లోనూ అడుగుబెట్టిన రాశి అక్కడ బిజీ అయిపొయింది. టాలీవుడ్ లో ప్రస్తుతం థాంక్యూ, పక్కా కమర్షియల్ సినిమాలలో నటిస్తుంది. రాశి ఖన్నా త్వరలో వెబ్ సిరీస్ లో కూడా ఎంట్రీ ఇవ్వనుంది. ది ఫ్యామిలీ మాన్ సిరీస్ కు దర్శకత్వం వహించిన రాజ్ డీకే దర్శకద్వయం, తెరకెక్కిస్తున్న కొత్త వెబ్ సిరీస్ లో షాహిద్ కపూర్ సరసన రాశి ఖన్నా కనిపించనుంది. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే రాశిఖన్నా ఈమధ్య కొంచెం డోస్ పెంచింది. పైగా పక్కా కమర్షియల్ సినిమా రిలీజ్ ఉండటంతో ప్రమోషన్ కోసం మరీ డోస్ పెంచింది. మొన్న హాట్ క్లీవేజ్ షోతో సెగలు పుట్టించింది. ఇప్పుడు బ్లాక్ శారీలో చిలిపిగా కవ్విస్తూ వైరల్ అయింది. మీరూ ఓ లుక్కెయ్యండి.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
Raashi Khanna Pakka commercial
Gossips
పక్కా కమర్షియల్ పెయిర్ … ఖర్చంతా నెట్ ఫ్లిక్స్ పైనే?

Nayanthara Vignesh Shivan Netflix | నయనతార సినీ కెరీర్ టాప్ రేంజ్ లో కొనసాగుతున్నా, అమ్మడి పర్సనల్ లైఫ్ లో మాత్రం చాలా హర్డిల్స్ ఉన్నాయి. శింబు తో లవ్, బ్రేకప్ ఆ తరువాత ప్రభుదేవాతో బ్రేకప్. ఇప్పుడు ఎనిమిదేళ్లనుంచి ప్రేమలో ఉన్న విగ్నేష్ శివన్ తోపెళ్లి. దాదాపు పదేళ్లనుంచి నయనతార మీడియా ముందుకు రావటానికి భయపడేది. అందుకే ఎంత పెద్ద సినిమా చేసినా మీడియా ముందుకు రాలేదు. అసలు ప్రమోషన్స్ లో ఎప్పుడూ కనిపించలేదు నయనతార. ఇందులో పెద్ద లాజిక్ ఏమి లేదు. గత లవ్ స్టోరీలు, బ్రేకప్ ల గురించి ప్రశ్నలు ఎదురవుతాయనేదే కారణం. ఇప్పుడు పెళ్లయిపోయింది కనుక ఇకముందు నయనతార ప్రమోషన్స్ లో కూడా కనిపిస్తుందని, మీడియా లో ఇంటర్వ్యూ లు కూడా ఇస్తుందని కోలీవుడ్ టాక్. ఇక అసలు విషయానికి వస్తే…
జూన్ 9 న పెళ్లి చేసుకున్న నయనతార, విగ్నేష్ శివన్ జంట, తమ పెళ్లి హోల్ సేల్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ కు ఇవ్వటం జరిగింది. ఇదొక 100 కోట్ల డీల్ అని, ఈ డీల్ క్లోజ్ చేసింది గౌతమ్ మీనన్ అని కోలీవుడ్ టాక్. మహాబలిపురం రిసార్ట్ లో అంగరంగ వైభవంగా జరిగిన ఈ పెళ్ళికి దాదాపు 25 కోట్లు ఖర్చయ్యాయని, వీటిలో ఒక్క పైసా కూడా నయన్, విగ్నేష్ తీయలేదని, మొత్తం ఖర్చు నెట్ ఫ్లిక్స్ దే అని సమాచారం. అయితే ఈ 25 కోట్లు ప్యాకేజీ లో భాగమా లేక అదనమా అనేది తెలియాల్సి ఉంది. ఈ పెళ్ళికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు త్వరలోనే నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి రానున్నాయి. ఇంతకుముందు కత్రినా కైఫ్ వెడ్డింగ్ రైట్స్ 100 కోట్లకు అమ్ముడుపోయాయి. ఇప్పుడు నయనతార ఆ రికార్డు ని బీట్ చేసినట్టే కనిపిస్తుంది.
Gossips
డేటింగ్ సైట్లో హీరోయిన్ .. ఫోటో పెట్టింది కూతురేనట

Suchitra Krishnamoorthy | తెలుగు బ్రాహ్మిన కుటుంబానికి చెందిన సుచిత్ర కృష్ణమూర్తి 90 వ దశకంలో నటిగా, గాయనిగా సంచలనం సృష్టించింది. విచిత్రమేమిటంటే అమ్మడు మలయాళ, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో నటించింది కానీ, మాతృబాష తెలుగులో అసలు అడుగే పెట్టలేదు. అప్పట్లో కుర్రకారుని కుర్రోతలూగించిన ఆమె ఆల్బమ్స్ లో కూడా ఎక్కడ తెలుగు వినిపించలేదు. ఆ తరువాత దర్శకనిర్మాత శేఖర్ కపూర్ ని పెళ్లి చేసుకుని, విడాకులు కూడా తీసుకుంది. చాలా ఏళ్లపాటు వీరు విడాకులకు, ఆస్తికోసం కోర్టుల చుట్టూ తిరగటం కూడా అప్పట్లో వైరల్ అయింది. వీరిద్దరికి కావేరీ కపూర్ అనే కూతురు కూడా ఉంది. ఇక అసలు విషయానికి వస్తే …
తాజాగా సుచిత్ర కృష్ణమూర్తి ‘భూల్ బుల్లయ్య 2’ లో నటించింది. ఈ సందర్భంగా కొన్ని ఇంటర్వ్యూలు కూడా ఇస్తుంది. తాజా ఇంటర్వ్యూలో అమ్మడు షాకింగ్ విషయాలు కొన్ని బయటపెట్టింది. శేఖర్ కపూర్ తో విడాకుల తరువాత ఆమెను డేటింగ్ చేయమని కూతురు బలవంతపెట్టిందట. డేటింగ్ సైట్లో ఫోటో పెట్టి ప్రొఫైల్ కూడా కూతురే క్రియేట్ చేసిందని, ఆ కారణం గా ఓ వ్యక్తితో కొంతకాలం రిలేషన్ లో ఉన్నానని, ఆ తరవాత బ్రేకప్ చెప్పానని అంటోంది సుచిత్ర. ఆ తరువాత ఫోన్ కి అసభ్యకరమైన మెస్సేజ్ లు రావటంతో డేటింగ్ సైట్ నుంచి ప్రొఫైల్ తొలగించిందట.
Gossips
పాప ఆశలపై నీళ్లు .. ఇకనైనా ఎన్టీఆర్ 30 కి ఓకే చెబుతుందా

Janhvi Kapoor | అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ ‘ధఢక్’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అది ఓ మరాఠీ సినిమా రీమేక్. ఆ తరువాత ‘ఘోస్ట్ స్టోరీస్’, ‘కార్గిల్ గర్ల్’, రూహి వంటి సినిమాల్లో నటించినా సాలిడ్ హిట్ మాత్రం ఇంకా జాన్వికి రాలేదు. ఇప్పుడు కూడా ఓ నాలుగు సినిమాలు చేతిలో ఉన్నా, ఒక్కటీ స్టార్ హీరో సినిమా కాదు. అమ్మడి యాక్టింగ్ టాలెంట్, డాన్సింగ్ టాలెంట్ కి వంక పెట్టాల్సిన అవసరమే లేదు. అయినా బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు రావట్లేదు. మరోపక్క సౌత్ నుంచి పాన్ ఇండియా స్థాయి ఆఫర్లు వస్తున్నా అమ్మడు దాగుడుమూతలు ఆడుతుంది. ఎన్టీఆర్ సినిమాలో జాన్వీ టాలీవుడ్ డెబ్యూ చేయనుందని వార్తలొచ్చాయి. అయితే అమ్మడు ఎస్/నో చెప్పకుండా డైలమాలో పెట్టింది. దీనికి ఓ కారణముందంటున్నారు జాన్వీ సన్నిహితులు…
జాన్వికి మంచి ఆఫర్స్ వస్తున్నా బాలీవుడ్ లో సాలిడ్ హిట్ పడలేదు. ఇక్కడ బ్లాక్ బస్టర్ కొట్టి సౌత్ లో ఎంట్రీ ఇవ్వాలనుకుంటుందట జాన్వీ. ‘గుడ్ లక్ జెర్రీ’ సినిమాపైనే జాన్వీ ఆశలన్నీ పెట్టుకుంది. నయనతార నటించిన ‘కోలమవు కోకిల’ సినిమా కు హిందీ రీమేక్ ఈ సినిమా. సినిమాలో సబ్జెక్టు ఉండటం, పైగా ఔట్పుట్ సంతృప్తికరంగా ఉండటంతో ఈ సినిమాతోనే మొదటి బ్లాక్ బస్టర్ కొట్టాలనుకుంది జాన్వీ కపూర్… కట్ చేస్తే… జులై 29 నుంచి ‘గుడ్ లక్ జెర్రీ’ హాట్ స్టార్ లో స్ట్రీమ్ చేయనున్నట్టు అధికారిక ప్రకటన వెలువడింది.
ఇప్పుడు కొరటాల అఫర్ కు ఓకే చెబుతుందని, ఎన్టీఆర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఖాయమని అంటున్నారు సినీ పండితులు.
View this post on Instagram
Janhvi Kapoor
-
Latest news23 hours ago
Nandamuri Balakrishna Tested positive for Covid-19
-
Latest news23 hours ago
Lavanya Tripathi Starrer “Happy Birthday” movie got preponed!
-
Latest news20 hours ago
Sai Pallavi Collaborated with Star Couple Suriya & Jyothika for The Film Gargi!
-
Latest news19 hours ago
Mass news for DJ Tillu fans, All set for the Sequel !
-
Actress Gallery16 hours ago
Raashi Khanna Dazzles in Cream Trendy Dress !
-
Reviews17 hours ago
Sita Ramam Teaser – Fresh & Appealing Content, Dulquer as Ram Simply Magical!
-
Actress Gallery23 hours ago
Thalaivi Nayantara new pics are just bliss to watch !