Gossips
పెళ్లయ్యాక నయనతార లో మార్పులు … ఇకపై కనిపిస్తుందట

Nayanthara marriage | నయనతార సినీ కెరీర్ టాప్ రేంజ్ లో కొనసాగుతున్నా, అమ్మడి పర్సనల్ లైఫ్ లో మాత్రం చాలా హర్డిల్స్ ఉన్నాయి. శింబు తో లవ్, బ్రేకప్ ఆ తరువాత ప్రభుదేవాతో బ్రేకప్. ఇప్పుడు ఎనిమిదేళ్లనుంచి ప్రేమలో ఉన్న విగ్నేష్ శివన్ తోపెళ్లి. దాదాపు పదేళ్లనుంచి నయనతార మీడియా ముందుకు రావటానికి భయపడేది. అందుకే ఎంత పెద్ద సినిమా చేసినా మీడియా ముందుకు రాలేదు. అసలు ప్రమోషన్స్ లో ఎప్పుడూ కనిపించలేదు నయనతార. ఇందులో పెద్ద లాజిక్ ఏమి లేదు. గత లవ్ స్టోరీలు, బ్రేకప్ ల గురించి ప్రశ్నలు ఎదురవుతాయనేదే కారణం. ఇప్పుడు పెళ్లయిపోయింది కనుక ఇకముందు నయనతార ప్రమోషన్స్ లో కూడా కనిపిస్తుందని, మీడియా లో ఇంటర్వ్యూ లు కూడా ఇస్తుందని కోలీవుడ్ టాక్.
అలాగే ఇదివరకటిలా కాకుండా ఒక సినిమా తరువాతే మరో సినిమా, రొమాంటిక్ సీన్లు చేయను లాంటి కొత్తగా కండిషన్లు పెడుతుందని సమాచారం. బహుశా మెల్లగా సినిమాలు వదిలేస్తుందేమో అని చెన్నై లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
View this post on Instagram
Nayanthara marriage
