Box office
అంటే సుందరానికి … ప్రీరిలీజ్ బిజినెస్

Ante Sundaraniki pre-release business | నాని, నజ్రియా ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ‘అంటే సుందరానికి’ రేపు విడుదలవుతుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి వివేక్ ఆత్రేయ దర్శకుడు. మొదటినుంచి ఎంతోకొంత క్రేజ్ ఉన్న ఈ సినిమాకు టీజర్, ట్రైలర్ లతో మరింత క్రేజ్ వచ్చింది. సినిమా లెంగ్త్ కూడా చాలా ఎక్కువే. దాదాపు మూడు గంటల నిడివి ఉండటంతో కొంత ట్రిప్ చేద్దామన్నారట దర్శకుడు, హీరో. అయితే నిర్మాతలు లెంగ్త్ ఎక్కువైనా పరవాలేదు, కట్ చేయటానికి వీల్లేదన్నారని ఫిలిం నగర్ టాక్. నిర్మాతలకు ఈ సినిమాపై అంత నమ్మకం ఉండటం సహజమే కానీ, జనం ఈరోజుల్లో అంత సేపు సినిమా భరించగలరా…. చూద్దాం… క్రేజుకు తగ్గట్టే బిజినెస్ కూడా బాగానే జరిగింది.
Ante Sundaraniki pre-release business
నైజాం : 10 Cr
సీడెడ్ : 4 Cr
ఆంధ్ర : 10 cr
AP-TG Total:- 24 CR
కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా: 2.5 Cr
ఓవర్సీస్ : 3.5 Cr
Total World Wide … 30 cr
అంటే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే థియేట్రికల్ గా 31 కోట్ల షేర్ కలెక్ట్ చేయాల్సి ఉంది. టాలివుడ్ లో ఈవారం విడుదలవుతున్న ఏకైక క్రేజీ సినిమా కనుక వారాంతంలో భారీ కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉంది. ఇప్పుడున్న పరిస్థితులలో నాని ‘అంటే సుందరానికి’ బ్రేక్ ఈవెన్ అవలీలగా సాధిస్తుందనేది ట్రేడ్ వర్గాల అభిప్రాయం. ఏదైనా మండే సాయంత్రానికి తేలిపోతుంది.
