adplus-dvertising
Connect with us

Reviews

భయం నా బయోడేటా లోనే లేదురా బోషడికే అంటూ గర్జించిన బాలయ్య

NBK 107 first Hunt

NBK 107 first Hunt | బాలయ్య ప్రస్తుతం కెరీర్ లో పీక్ స్టేజి ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. గత చిత్రం అఖండ అద్భుత విజయం సాధించటమే కాక కరోనా భయంతో విలవిలా లాడుతున్న టాలీవుడ్ కు దిశానిర్దేశం చేసింది. అంతేకాక బాలయ్య కెరీర్ లో మొదటిసారిగా బుల్లితెర పై కనిపించి తెలుగు ప్రేక్షకుల థింకింగ్ నే మార్చేశారు. ఈమధ్యే బాలయ్య తదుపరి చిత్రం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో పట్టాలెక్కింది. ఈసినిమాలో మొదటిసారిగా బాలయ్య శృతిహాసన్ తో రొమ్యాన్స్ చేయనున్నాడు. కన్నడ హీరో దునియా విజయ్ ఈ సినిమాలో విలన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే.  ఇందులో బాలయ్య నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కూడా నటించనున్నాడట. ఇక అసలు విషయానికి వస్తే ….

ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా ఈ సినిమానుంచి ఓ మాస్ పోస్టర్ రిలీజ్ చేసారు. కత్తి పట్టుకున్న బాలయ్య పోజ్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయిపొయింది. బాలయ్య పుట్టినరోజు సందర్భంగా జూన్ 10 న అధికారికంగా టైటిల్ ను ప్రకటించనున్నారని, అలాగే టీజర్ విడుదల కానుందని ఇంతకు ముందే లీకులందాయి. అయితే ఈరోజు టీజర్ విడుదల చేసినా టైటిల్ అనౌన్స్ చేయలేదు. బహుశా మరో అప్డేట్ ఏమైనా ఇస్తారేమో చూడాలి. ఇక టీజర్ లో బాలయ్య అందరూ ఊహించినట్టుగానే డైలాగ్స్ తో దుమ్ము లేపేసాడు. ముఖ్యంగా….

భయం నా బయోడేటా లోనే లేదురా బోషడికే

నరకడం మొదలు పెడితే , ఏ పార్ట్ ఎదో మీ పెళ్ళాలకు కూడా తెలియదు నా కొడకల్లారా

అనే డైలాగులు ఫ్యాన్స్ కు కిక్కిచ్చేలా ఉన్నాయి … అలాగే బాలయ్య స్టైలిష్ లుక్ ఓ హైలైట్ అని చెప్పవచ్చు. అఖండ లాంటి భారీ హిట్ తరువాత వస్తున్న బాలయ్య సినిమా కనుక అంచనాలు కూడా భారీగానే ఉండటం సహజం. పైగా ప్రస్తుతం టాలీవుడ్ లో బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్ అయిన మైత్రి మూవీస్ నిర్మిస్తున్న సినిమా కనుక రిచ్ లుక్ టీజర్ లోనే కనిపించింది. అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా కట్ చేసిన టీజర్ పై మీరూ ఓ లుక్కెయ్యండి.

Advertisement