Box office
స్టార్ హీరో లేకుండానే సాలిడ్ హిట్ … 150 కోట్లు .. స్టిల్ స్ట్రాంగ్ హోల్డ్

Bhool Bhulaiyaa 2 collections | గత కొన్ని నెలలుగా సౌత్ సినిమా బాలీవుడ్ ను కబ్జా చేసింది. అల్లు అర్జున్ పుష్ప, రాజమౌళి ఆర్ ఆర్ ఆర్, యష్ కెజిఎఫ్ 2 బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను పరుగులు పెట్టించాయి. వీటి ధాటికి ఎన్నో బాలీవుడ్ సినిమాలు అడ్రస్ లేకుండా పోయాయి. దీనిని తట్టుకోలేని బాలీవుడ్ సెలెబ్రిటీలు చాలామంది నోటిదూల ప్రదర్శించటం కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇండియా అంతా ప్రేక్షకులు సౌత్ సినిమాలకు బ్రహ్మరధం పడుతూ, బాలీవుడ్ సినిమాల్ని లెక్క చేయకపోవటం తట్టుకోలేకపోతున్నారు బాలీవుడ్ ప్రముఖులు. ఇక అసలు విషయానికి వస్తే… టబు, కియారా అద్వానీ, కార్తీక్ ఆర్యన్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన భూల్ బులయ్య 2 మంచి టాక్ తెచ్చుకుంది.
సినిమా కథ, స్క్రీన్ ప్లే బోర్ కొట్టకుండా నడిపించిన విధానం బాగుంది. అలాగే డ్యూయల్ రోల్ లో టబు చాలాకాలం తరువాత విశ్వరూపం చూపించింది. ఇదే సినిమాకు ప్రాణం పోసింది అని చెప్పవచ్చు. ఇప్పటికే 150 కోట్లు కలెక్ట్ చేసి ఇంకా స్ట్రాంగ్ హోల్డ్ మెయిన్ టైం చేస్తుంది. ఈవారం విడుదలైన అక్షయ్ కుమార్ ‘సామ్రాట్ పృథ్వీరాజ్’ భారీ డిజాస్టర్ దిశగా వెళుతుండటం భూల్ బులయ్య 2 కి మరింత కలిసొచ్చే అంశం. అయితే బాలీవుడ్ ఔత్సాహికులు కొంత ఎక్కువగా ఊహించుకుని రికార్డ్స్ అన్నిటిని ఈ సినిమా బీట్ చేస్తుందని జోశ్యం చెబుతున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో?
#BhoolBhulaiyaa2 is SUPERB in Week 2… The trend on weekdays is second-best *this year*, after #TKF… Will hit ₹ 150 cr on [third] Sat/Sun… [Week 2] Fri 6.52 cr, Sat 11.35 cr, Sun 12.77 cr, Mon 5.55 cr, Tue 4.85 cr, Wed 4.45 cr, Thu 4.21 cr. Total: ₹ 141.75 cr. #India biz. pic.twitter.com/lfb90EfIN2
— taran adarsh (@taran_adarsh) June 3, 2022
