Box office
11 వరోజు కూడా స్ట్రాంగ్ హోల్డ్ … బాలీవుడ్ రికార్డులవైపు పరుగులు

Bhool Bhulaiyaa 2 box office | గత కొన్ని నెలలుగా సౌత్ సినిమా బాలీవుడ్ ను కబ్జా చేసింది. అల్లు అర్జున్ పుష్ప, రాజమౌళి ఆర్ ఆర్ ఆర్, యష్ కెజిఎఫ్ 2 బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను పరుగులు పెట్టించాయి. వీటి ధాటికి ఎన్నో బాలీవుడ్ సినిమాలు అడ్రస్ లేకుండా పోయాయి. దీనిని తట్టుకోలేని బాలీవుడ్ సెలెబ్రిటీలు చాలామంది నోటిదూల ప్రదర్శించటం కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇండియా అంతా ప్రేక్షకులు సౌత్ సినిమాలకు బ్రహ్మరధం పడుతూ, బాలీవుడ్ సినిమాల్ని లెక్క చేయకపోవటం తట్టుకోలేకపోతున్నారు బాలీవుడ్ ప్రముఖులు. ఇక అసలు విషయానికి వస్తే… టబు, కియారా అద్వానీ, కార్తీక్ ఆర్యన్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన భూల్ బులయ్య 2 మంచి టాక్ తెచ్చుకుంది.
సినిమా కథ, స్క్రీన్ ప్లే బోర్ కొట్టకుండా నడిపించిన విధానం బాగుంది. అలాగే డ్యూయల్ రోల్ లో టబు చాలాకాలం తరువాత విశ్వరూపం చూపించింది. ఇదే సినిమాకు ప్రాణం పోసింది అని చెప్పవచ్చు. ఈ సినిమా రెండో వారాంతానికి 125 కోట్ల పైన కలెక్ట్ చేసింది. అలాగే రెండో సోమవారం కూడా స్ట్రాంగ్ హోల్డ్ తో 6 కోట్లు దాటి కలెక్ట్ చేయటంతో ఇక ఈ సినిమా కు తిరుగులేదంటున్నారు ట్రేడ్ పండితులు. ఈ ఏడాది 100 కోట్ల సినిమా అయిన గంగు భాయ్ ని దాటి 234 కోట్లు కలెక్ట్ చేసిన కాశ్మీర్ ఫైల్స్ వైపు పరుగులు తీస్తుంది భూల్ బులయ్య 2.
అయితే బాలీవుడ్ ఔత్సాహికులు కొంత ఎక్కువగా ఊహించుకుని రికార్డ్స్ అన్నిటిని ఈ సినిమా బీట్ చేస్తుందని జోశ్యం చెబుతున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో?
#BhoolBhulaiyaa2 is proving all calculations and estimations wrong… The [second] Mon numbers are an eye-opener… Crosses ₹ 125 cr, marches towards ₹ 150 cr… [Week 2] Fri 6.52 cr, Sat 11.35 cr, Sun 12.77 cr, Mon 5.55 cr. Total: ₹ 128.24 cr. #India biz. pic.twitter.com/4DCBtrDSIA
— taran adarsh (@taran_adarsh) May 31, 2022
Bhool Bhulaiyaa 2 box office
