Box office
ఎఫ్ 3 ప్రీరిలీజ్ బిజినెస్

F3 pre release business | అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్ ప్రధాన పాత్రలలో దిల్ రాజు నిర్మించిన తాజా చిత్రం ఎఫ్ 3 . ఇంతకు ముందు విజయం సాధించిన ఎఫ్ 2 సినిమాకు ఇది సీక్వెల్. ఈనెల 27 న ఈ సినిమా విడుదలవుతుంది. సెంటిమెంట్లను ఎక్కువగా నమ్మే టాలీవుడ్ లో సీక్వెల్స్ పెద్దగా సక్సెస్ అయిన దాఖలాలు లేవు. ఈ సెంటిమెంట్ ఇప్పుడు ఎఫ్ 3 ని కూడా భయపెడుతుంది. ఒకసారి గతంలోకి వెళితే …. అల్లు అర్జున్ ఆర్య భారీ సక్సెస్ తో సీక్వెల్ తెరకెక్కి డిజాస్టర్ అయింది. అదే కోవలో రవితేజ కిక్, మంత్ర, అవును, శంకర్ దాదా ఎంబిబిఎస్, సత్య, మనీ, గబ్బర్ సింగ్, మన్మధుడు, గాయం లాంటి ఎన్నో సినిమాల సీక్వెల్స్ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఎఫ్ 3 ఈ సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తుందేమో చూడాలి. హిట్ సినిమా సీక్వెల్ కావటంతో ఈ సినిమాకు బిజినెస్ కూడా బాగానే జరిగింది.
F3 pre release business
నైజాం : 18 Cr
సీడెడ్ : 8.4 Cr
ఉత్తరాంధ్ర : 7 cr
ఈస్ట్ : 4.5 cr
వెస్ట్ : 4 cr
గుంటూరు : 5 Cr
కృష్ణ : 4.5 Cr
నెల్లూరు : 2.4 Cr
AP-TG Total:-53.8 CR
కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా: 4.6 Cr
ఓవర్సీస్ : 5.2 Cr
Total World Wide: 63.60 cr
అంటే బ్రేక్ ఈవెన్ కావాలంటే 65 కోట్లు కలెక్ట్ చేయాల్సి ఉంది. ఇప్పటికే బడా సినిమాలన్నిటి థియేటర్ రన్ ముగియటం, వచ్చేవారం కూడా ఈ ఎఫ్ 3 కి పోటీ లేకపోవటం తో బ్రేక్ ఈవెన్ కి పెద్దగా సమయం పట్టకపోవచ్చు. అయితే హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ లాంటి నగరాల్లో టామ్ క్రూస్ ‘టాప్ గన్ మెవరిక్’ ఎఫ్ 3 కి కొంత పోటీ ఇచ్చే అవకాశం లేకపోలేదు. అపజయమెరుగని కొరటాల శివ ఈమధ్యే ఆచార్యతో భారీ డిజాస్టర్ నమోదు చేసాడు. అలాగే టాలీవుడ్ లో అపజయమెరుగని మరో దర్శకుడు అనిల్ రావిపూడి తన రికార్డు ను కొనసాగిస్తాడో లేదో చూడాలి.
