Box office
సూపర్ హిట్టే … కానీ ఇంత ఓవరాక్షన్ అవసరమా

Bhool Bhulaiyaa 2 Box office collections | గత కొన్ని నెలలుగా సౌత్ సినిమా బాలీవుడ్ ను కబ్జా చేసింది. అల్లు అర్జున్ పుష్ప, రాజమౌళి ఆర్ ఆర్ ఆర్, యష్ కెజిఎఫ్ 2 బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను పరుగులు పెట్టించాయి. వీటి ధాటికి ఎన్నో బాలీవుడ్ సినిమాలు అడ్రస్ లేకుండా పోయాయి. దీనిని తట్టుకోలేని బాలీవుడ్ సెలెబ్రిటీలు చాలామంది నోటిదూల ప్రదర్శించటం కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇండియా అంతా ప్రేక్షకులు సౌత్ సినిమాలకు బ్రహ్మరధం పడుతూ, బాలీవుడ్ సినిమాల్ని లెక్క చేయకపోవటం తట్టుకోలేకపోతున్నారు బాలీవుడ్ ప్రముఖులు. ఇక అసలు విషయానికి వస్తే… టబు, కియారా అద్వానీ, కార్తీక్ ఆర్యన్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన భూల్ బులయ్య 2 మంచి టాక్ తెచ్చుకుంది. సినిమా కథ, స్క్రీన్ ప్లే బోర్ కొట్టకుండా నడిపించిన విధానం బాగుంది. అలాగే డ్యూయల్ రోల్ లో టబు చాలాకాలం తరువాత విశ్వరూపం చూపించింది. ఇదే సినిమాకు ప్రాణం పోసింది అని చెప్పవచ్చు.
ఈ సినిమాకు విడుదలకు ముందే అడ్వాన్స్ బుకింగులు బాలీవుడ్ లో విపరీతమైన ఆశలు కల్పించాయి. మొదటిరోజు టాక్ కూడా బాగుండటంతో కొంతమంది ఔత్సాహిక బాలీవుడ్ ప్రముఖులు ఆర్ ఆర్ ఆర్ రికార్డు బీట్ చేస్తుంది అంటూ జోశ్యం చెప్పేసారు. కట్ చేస్తే మొదటి రోజు 14.11 కోట్ల షేర్ తో సరిపెట్టుకుంది భూల్ బులయ్య 2. అయితే టాక్ బాగుండటంతో రెండో రోజు కలెక్షన్స్ ఊపందుకున్నాయి. మొదటి వారాంతానికి 56 కోట్లు కలెక్ట్ చేసి సాలిడ్ గా రన్ అవుతుంది భూల్ బులయ్య 2. అయితే అప్పుడే మరోసారి ఔత్సాహికులు 200 కోట్లు ఎంతో దూరంలో లేదంటూ ప్రచురించేసారు. సినిమా మండే కూడా బాగానే హోల్డ్ చేసింది కనుక వీరి ఆశలు నెరవేరతాయేమో చూడాలి. వీళ్ళూహించినంత సీన్ లేకపోయినా బొమ్మ బ్లాక్ బస్టరే.
#BhoolBhulaiyaa2 3 days box office
India Nett – 55.96 cr
India Gross – 67 cr
Overseas – 17 cr
Worldwide – 84 cr
Verdict – Super Hit— Indian Box Office (@box_oficeIndian) May 23, 2022
