Gossips
హౌస్ ఫుల్ … కలెక్షన్ నిల్ .. ఇకపై కష్టమే

Theaters Ott | టాలీవుడ్ లో కొన్ని దశాబ్దాల నుంచి ఖాళీ థియేటర్స్ బయట హౌస్ ఫుల్ బోర్డులు పెట్టటం అలవాటైపోయింది. ముఖ్యంగా 90 వ దశకంలో ఓ స్టార్ హీరో సినిమాలన్నిటికీ హౌస్ ఫుల్ బోర్డులు పెట్టటం కోసం ప్రత్యేకంగా కొంత బడ్జెట్ కేటాయించేవారని చెప్పుకునేవారు. కాలంతో పాటు ఆ సిస్టం లోనూ మార్పు వచ్చింది. ఒకప్పుడు ఒక హీరో సినిమాలకే ఇలా చేసి జనాన్ని మోసం చేసేవారు. ఇప్పుడు ఆ హీరో ఈ హీరో అనిలేదు. అందరిదీ అదే తంతు. అప్పట్లో ఆ హీరో కానీ, ఆ కాంపౌండ్ కి చెందిన వారు కానీ డబ్బులు ఇచ్చి ఆలా మైంటైన్ చేసేవారు. ఇప్పుడు ఏకంగా థియేటర్ యాజమాన్యాలే జనాన్ని మోసం చేస్తున్నాయి.. ఉదాహరణకి ఆచార్య సినిమా తీసుకుందాం.
బడా సినిమాలకి ఆన్లైన్ లో 30 నుంచి 40 శాతం టికెట్లే అందుబాటులో ఉంటాయి. మిగతావన్నీ థియేటర్ యాజమాన్యాలు బ్లాక్ చేసి, కౌంటర్ లో అమ్ముతాయి. కొన్ని చోట్ల అవే బ్లాక్ లో కూడా అమ్మటం జరుగుతుంది . అన్ని సినిమాల మాదిరిగానే ఆచర్యకూ థియేటర్ యాజమాన్యాలు మొదటి మూడు రోజులకూ 70 శాతం టికెట్స్ బ్లాక్ చేసాయి. తీరా అవి అమ్ముడు కాక, ఆన్లైన్ లో హౌస్ ఫుల్ కనిపిస్తూ, థియేటర్ ఖాళీగా ఉండి లేనిపోని గందరగోళం నెలకొంది. ఆచార్య నుంచి పాఠం నేర్చుకున్న థియేటర్ యాజమాన్యాలు ‘సర్కారు వారి పాట’ కు మొత్తం టికెట్లు ఆన్లైన్ లో అందుబాటులో ఉంచారు. బహుశా ఇకపై ఫేక్ హౌస్ ఫుల్స్ కనిపించకపోవచ్చు.
