adplus-dvertising
Connect with us

Latest news

సోషల్ మీడియా కు గుడ్ బై చెప్పేసిన శిల్పా శెట్టి

Shilpa Shetty

Shilpa Shetty | పొడుగు కాళ్ళ సుందరి శిల్పా శెట్టి టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా పరిచయమే. ఎప్పుడూ సోషల్ మీడియాకు అందుబాటులో ఉండే బాలీవుడ్ బ్యూటీలలో శిల్పా ఒకరు. ఈమధ్య ఆమె భర్త రాజ్ కుంద్రా పోర్న్ రాకెట్ కేసు లో ఇరుక్కున్నప్పుడు కొంతకాలం సోషల్ మీడియా కు దూరంగా ఉంది శిల్పా శెట్టి. అయితే ఆ డిప్రెషన్ లో నుంచి తొందరగానే బయటపడి, బాలీవుడ్ లో, ఓటిటిలో, టీవీ షోస్ లో తన హవా కొనసాగిస్తోంది శిల్పా శెట్టి. తాజాగా అమ్మడు ఓ బ్లాంక్ ఫోటో షేర్ చేసి, సోషల్ మీడియా కు గుడ్ బై చెప్పింది. అంటా రొటీన్ గ ఉందని, కొత్తదనం లేదని, అందుకే సోషల్ మీడియాకు దూరంగా వుండాలనుకున్నానని చెబుతుంది. అయితే 25 మిలియన్లకన్నా ఎక్కువ ఫాలోయర్స్ ఉన్న శిల్పాశెట్టి అకౌంట్ మాత్రం బ్లాక్ చేయలేదు. అంటే ఇది తాత్కాలికమే అని భావించాలేమో…

Shilpa Shetty

Advertisement