19 ఏళ్ళు పూర్తి చేసుకున్న మహేష్ చిత్రం

554

సూపర్ స్టార్ మహేష్ బాబు , సోనాలి బింద్రే జంటగా క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశి రూపొందించిన చిత్రం ‘మురారి’.

ఈ చిత్రం 2001 ఫిబ్రవరి 17 న విడుదల అయ్యి
విజయం సాధించడమే గాక కల్ట్ క్లాసిక్ గా నిలిచింది . మహేష్ బాబు నటనకు గాను ఆయనకు స్పెషల్ జ్యూరీ నంది అవార్డు కూడా దక్కింది . ఈ సినిమా కు ఆయన ఎన్నో ప్రశంసలు అందుకున్నారు

ఈ చిత్రం నేటితో 19 సంవత్సరాలు పూర్తి చేసుకుంది , తమ హీరో చిత్రం 19 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భమున సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ట్విట్టర్ వేదికగా #19YearsOfClassicMurari ట్యాగ్ ను ట్రెండ్ చేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు . ఈ చిత్రం లో మహేష్ బాబు , సోనాలి బింద్రే తో పాటు కైకాల సత్యనారాయణ , గొల్లపూడి , లక్ష్మి , రఘుబాబు , రవి బాబు ఎం ఎస్ నారాయణ , అన్నపూర్ణ తతిదారులు నటించారు .