దర్శకుడు రాజ్ కుమార్ మృతి తీరని లోటు: మెగాస్టార్ చిరంజీవి

494

దర్శకుడు రాజ్ కుమార్ మృతి తీరని లోటని మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు .

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ –
రాజ్ కుమార్ గారు నన్ను కలసి తన దర్శకత్వంలో తెరక్కేక్కిస్తున్న ”పునాది రాళ్లు” అనే సినిమాలో నటించమని అడిగారు.

అప్పుడు నేను ఇంకా
ఇనిస్టిట్యూట్లో శిక్షణ తీసుకుంటున్నాను, శిక్షణ పూర్తి కాకుండా ఎలా అని అడిగిన
కూడా బలవంతంగా నువ్వే చేయాలి అని నాతో చేయించడం జరిగింది. అలా ‘పునాది రాళ్లు’ సినిమా షూటింగ్లో పాల్గొన్నాను.

నా నట జీవితానికి అదే “పునాది రాళ్లు” వేసింది. ఈమధ్యనే ఆయన మా ఇంటికి వచ్చి కలిశారు, అనారోగ్యంతో ఉన్నానని చెప్పడంతో అపోలో ఆస్పత్రికి పంపించి వైద్య పరీక్షలు కూడా చేయించడం జరిగింది, ఆయన పూర్తి ఆరోగ్యంతో మళ్లీ నా దగ్గరకు వస్తారు అని అనుకున్నాను, ఇంతలో ఇలా జరగటం చాలా బాధాకరం. రాజ్ కుమార్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అన్నారు.