జనవరి ౩1న విడుదల కాబోతున్న అనుష్క ‘నిశ్శబ్దం’ !!

53

అనుష్క ప్రధాన పాత్రలో హేమంత్ మధుకర్ దర్శకత్వంలో రాబోతున్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘నిశ్శబ్దం’. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. జనవరి 31న ‘నిశ్శబ్దం’ విడుదల కాబోతుందని చిత్రబృందం ప్రకటించింది. ఇక ఇటివలే టీజర్ ను రిలీజ్ చేసింది చిత్రబృందం. టీజర్ సినిమాపై అంచనాలను పెంచింది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

కాగా ఈ సినిమాలో అనుష్క ఆర్ట్ లవర్ గా కనిపించనుంది. ఇక మాధవన్ ఈ సినిమాలో సెల్లో ప్లేయర్ గా నటించనున్నాడు. ఇక ఈ చిత్రంలో అనుష్క, మాధవన్ లతో పాటు సుబ్బరాజు, అంజలి, షాలిని పాండే తో పాటు ప్రముఖ హాలీవుడ్ నటుడు మైఖేల్ మాడిసన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ‘భాగమతి’గా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్న అనుష్క.. మరి ఈ సినిమాతో కూడా సూపర్ హిట్ అందుకుంటుందేమో చూడాలి. రచయిత కోన వెంకట్ తన బ్యానర్‌ లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.